Udayinchina Song Lyrics – Kalusukovalani Movie

Featured Video Play Icon

Udayinchina Song Lyrics in Telugu

హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే

Also, Read – Kaastha Ninnu Song Lyrics – Student No.1 Movie

మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగుఅడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలపనీ
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే

Click here to know where to watch :

Share This Post

Post Comment