Kanya Kumari Song Lyrics in Telugu
ఊ… ఊ… ఊ… ఊ…
చం చక్ చం చక్ చం చం…
కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతిలేని సుందరి
జింగ్ చక్ చం… జింగ్ చక్ చాం…
గోపాలబాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల
మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
సాగనీమరి సరదాల గారడీ
జింగ్ చక్ జింగ్ చక్ చా… జింగ్ చక్ జింగ్ చక్ చా…
Also, Checkout
కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం
వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం
భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
చూడమ్మా… హంగామా…
అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం
కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ… హా…
జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో
చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో
నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో
మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో
ఓయమ్మో… మాయమ్మో…
దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం
ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా
జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
గోపాలబాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల.
పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతిలేని సుందరి
జింగ్ చక్ జింగ్ చక్ చాం…
జింగ్ చక్ జింగ్ చక్ చాం…
సాగనీమరి సరదాల గారడీ
జింగ్ చక్ జింగ్ చక్ చా… జింగ్ చక్ జింగ్ చక్ చా…
Also, Read – Malli Malli Merupula Song Lyrics – Nenu Naa Rakshasi Movie