Srikaram chudutunatu Song From Kudirithe kappu coffee Movie. This Song is Sung by S. P. Balasubrahmanyam and Lyrics are penned by Sirivennela Sitaramasastri. Music Composed by Yogeshwara Sharma.
Song Details:-
- Movie:- Kudirithe kappu coffee Movie
- Singer:- S. P. Balasubrahmanyam
- Lyrics:- Sirivennela Sitaramasastri
Srikaram chudutunatu Song Lyrics In Telugu
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులకి చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా
రపాకారం కడుతున్నట్టు రాబోయే పండ గ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా
॥శ్రీకారం॥
జల జల జల జాజుల వాన కిల కిల కిల కిన్నెర వీణ
మిల మిల మిన్నంచులపైన మెలిదిరిగిన చెంచల యాన
మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణ
నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తై నీ వెనకాలేమౌతున్నా
నీ వీపును ముళ్లై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీగాలై సోకినవారు గాలిబ్ గజలైపోతారు
నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా
Also, Read – Hello Hello Song Lyrics – Dhada Movie
నక్షత్రాలెన్నంటూ లెక్కడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీక టినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు
అందాకా మారామ్మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుక్కాని
నడిమివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మ
Also, Read about movie download websites: